News October 6, 2024

గుంటూరు: చదివింది ఇంజినీరింగ్.. చేసేది చోరీలు

image

మెకానికల్ ఇంజినీరింగ్ చదివి చెడు వ్యసనాలకు బానిసగా మారి చోరీలు చేస్తున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్టేషన్ ఎస్.హెచ్.ఓ వీరేంద్రబాబు మాట్లాడుతూ.. గొర్రెల చినబాబు అనే యువకుడు ఎస్వీఎన్ కాలనీలో జరిగిన చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని‌, గతంలో ఇతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News March 11, 2026

వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం

image

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారని నాయకులు చెబుతున్నారు.

News March 11, 2026

పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

image

పెదకాకాని రైల్వే స్టేషన్‌లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్‌గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.