News October 6, 2024

యానిమేషన్ సినిమాకు ₹14,002 కోట్ల వసూళ్లు

image

ఓ యానిమేషన్ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. నవ్వులు, జీవిత పాఠాలు, జీవితాంశాల ఆధారంగా తెరకెక్కిన Inside Out-2 ప్రపంచ వ్యాప్తంగా ₹14,002 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది. పిక్సర్ యానిమేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కెల్సీ మన్ దర్శకుడు. హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్‌లో రిలే పాత్రకు బాలీవుడ్ నటి అనన్య పాండే డబ్బింగ్ చెప్పారు.

Similar News

News March 6, 2025

ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

image

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్‌‌ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 6, 2025

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.

News March 6, 2025

మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు

image

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్‌కు రాకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.

error: Content is protected !!