News October 6, 2024
రూ.కోట్ల ఇళ్లు కూల్చేసి డబుల్‌బెడ్రూం ఇస్తావా?: ఈటల

TG: ‘మూసీ కూల్చివేతల’పై CM రేవంత్‌కు BJP MP ఈటల లేఖ రాశారు. ‘మూసీ సుందరీకరణ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? DPR ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం ఏంటి? రూ.కోట్ల విలువ చేసే ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్రూం ఇస్తా అంటే ఎలా? అంతపెద్ద గంగా ప్రక్షాళనకే రూ.22వేల కోట్లు ఖర్చు. మూసీకి రూ.1.50లక్షల కోట్లెందుకు?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 2, 2026
అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖండించారు. ఇరాన్‌పై అమెరికా దాడికి దిగితే అది రెండు దేశాలకే పరిమితం కాదని, భీకరమైన ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమపై దాడి జరిగితే మాత్రం గట్టిగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో సంచలనం రేపుతున్నాయి.
News February 2, 2026
ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

☛ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
☛ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
☛ 1940: రచయిత ఎస్.వి. రామారావు జననం
☛ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
☛ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
☛ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం (ఫొటోలో)
News February 2, 2026
గజినీ తరహా రోల్‌లో సూర్య! ఆసక్తి రేపుతున్న కొత్త మూవీ టైటిల్..

కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జులైలో విడుదల కానున్న ఈ చిత్రంలో సూర్య పాత్ర గజినీ తరహాలో ఉంటుందని టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో సూర్య నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో రాధిక, రవీనా టాండన్, హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తున్నారు.


