News October 6, 2024

ఆ హీరోయిన్‌ను వద్దన్న సల్మాన్ ఖాన్?

image

సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా వచ్చిన ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సోనమ్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు సల్మాన్ ఒప్పుకోలేదని ఆ మూవీ దర్శకుడు సూరజ్ భర్జాత్య తాజాగా తెలిపారు. ‘మాకు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. నా కళ్లముందే పెరిగిన అమ్మాయితో సన్నిహితంగా నటించడం నాకు ఇబ్బంది’ అని అన్నారని సూరజ్ పేర్కొన్నారు. ఆ పాత్రకు ఆమే కరెక్ట్ అని చెప్పి తానే సల్మాన్‌ను ఒప్పించానని వెల్లడించారు.

Similar News

News January 1, 2026

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

image

కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* క‌నుబొమ్మ‌లపై రోజూ ఆముదం నూనెను రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా క‌ల‌బంద జెల్ ను క‌నుబొమ్మ‌ల‌పై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. * కొబ్బ‌రి నూనెలో రోజ్‌మేరీ నూనెను క‌లిపి క‌నుబొమ్మ‌ల‌పై మ‌ర్ద‌నా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.

News January 1, 2026

పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

image

కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1,912కు చేరింది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు LPG ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

News January 1, 2026

APPLY NOW: పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/