News October 6, 2024
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 128 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా 11.5 ఓవర్లలోనే ఛేదించింది. సూర్య 29, శాంసన్ 29, అభిషేక్ 16, నితీశ్ 16* రన్స్ చేయగా చివర్లో హార్దిక్(16 బంతుల్లో 39*) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 2 సిక్సర్లు, 5 ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించారు.
Similar News
News February 2, 2026
పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
News February 2, 2026
స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.
News February 2, 2026
ఐరన్ లోపం-లక్షణాలు

ఐరన్ లోపం ఉంటే రక్తం తగినంత తయారు కాదు. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు తెల్లగా మారుతుందంటున్నారు నిపుణులు. తరచూ చల్లని పదార్థాలను తినాలనిపించడం, నోట్లో అల్సర్లు, శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం, కాళ్లు, చేతులు చల్లగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ఈ వీటిని గుర్తిస్తే ముందుగానే తగిన చికిత్స తీసుకోవచ్చు. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు.


