News October 7, 2024

గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన

image

INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News July 6, 2025

మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

image

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

News July 6, 2025

‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

image

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.

News July 6, 2025

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.