News October 7, 2024

జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO

image

శ్రీకాకుళం జిల్లాలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు

Similar News

News March 12, 2026

శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.

News March 12, 2026

శ్రీకాకుళం: ఏళ్లు గడిచినా కేసు తేలదా..ఎదురు చూపులేనా?

image

శ్రీకాకుళం జిల్లా రైతులకు వంశధార నీటి కష్టాలు ఈ ఏటా తప్పేలా లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏర్పాటైన కాలువల షట్టర్లు కొన్ని శిథిలావస్థకు, మరికొన్ని పాడయ్యాయి. ఎగువ నీరు వృథాగా పోతుండడంతో ఆస్థానంలో తాత్కాలిక కర్రచెక్కలు, ఇతర సామగ్రి అడ్డుగా చేరాయి. వాటిని నేటికీ సరి చేయక పోలాలకు నీరు చేరదనట్లు అనిపిస్తోంది. దీని నిర్వహణకు 2007లో కేటాయించిన నిధుల అవకతవకల కేసు CBI పరిధిలో ఉంది.

News March 12, 2026

ఎచ్చెర్ల: ఐఐఐటీ కొత్త ఇన్‌ఛార్జ్ డైరక్టర్ ఎవరంటే?

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) ఇన్‌ఛార్జ్, డైరెక్టర్‌గా రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్‌ను నియమిస్తూ ఇన్‌ఛార్జ్, ఛాన్సలర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీని రిలీవ్ చేస్తూ ఓ ప్రకటన చేశారు.