News October 7, 2024

BIG ALERT: మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు

image

AP: ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

Similar News

News March 21, 2026

యశ్ దయాల్‌కు షాక్ ఇచ్చిన RCB!

image

మరో వారంలో IPL ప్రారంభం కానుండగా RCB కీలక బౌలర్ యశ్ దయాల్ ప్రాక్టీస్ క్యాంపులో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఆయనపై రేప్ <<17189705>>ఆరోపణలు<<>> ఉన్న నేపథ్యంలో జట్టు నుంచి తప్పించి ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇక టీమ్ ట్రావెల్ బస్సుపై యశ్ మినహా మిగతా ప్లేయర్లందరి ఫొటోలు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. అటు దయాల్ గత నెల రహస్యంగా పెళ్లి చేసుకోగా ఇటీవల ఆ విషయం బయటికొచ్చిన విషయం తెలిసిందే.

News March 21, 2026

రాష్ట్రంలో నాన్‌వెజ్.. నాన్‌స్టాప్!

image

TG: రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-14లో 2.30 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2024-25 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 2019 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశుసంపద ఉందని తెలిపింది. గొర్రెల సంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో, పౌల్ట్రీలో మూడో ప్లేస్‌లో నిలిచినట్లు చెప్పింది.

News March 21, 2026

బడ్జెట్‌లో మైక్రో SUV.. సరికొత్తగా ఎక్స్‌‌టర్

image

మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్‌గా మార్కెట్లోకి హ్యుందాయ్ సరికొత్త ఎక్స్‌టర్‌ను తీసుకొచ్చింది. ఈ మైక్రో SUV ప్రారంభ ధరను రూ.5,79,000(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే కాస్త డిజైన్ ఛేంజెస్ చేసింది. తొలిసారి డ్యాష్‌క్యామ్ ఫీచర్ తీసుకొచ్చింది. స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్‌బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్‌ సహా 25రకాల మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.