News October 7, 2024
చిత్తూరు: 405 పంచాయతీ సెక్రటరీల బదిలీల

చిత్తూరు జిల్లాలో ఆదివారం భారీగా సాధారణ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలోని DPO పరిధిలో 405 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకు 202 మంది, గ్రేడ్-5 కింద 152 మంది, ఈవోపీఆర్డీలు ఏడుగురు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6(డిజిటల్ అసిస్టెంట్) 44 మంది బదిలీ అయ్యారు.
Similar News
News April 2, 2026
చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
News April 2, 2026
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కో టిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.
News April 2, 2026
వాటి జోలికెళితే డేంజర్: చిత్తూరు SP

లోన్ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తెలియని యాప్‌ల ద్వారా రుణాలు పొందితే వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పెట్టినట్లేనని ఆయన హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు పొందాలని సూచించారు.


