News October 7, 2024

HYDRA కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!

image

TG: నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్‌లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం ₹650కోట్లకే పరిమితమైంది. HYD, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుంది.

Similar News

News March 28, 2026

ఆంధ్రా అమ్మాయిలు అదరగొట్టారు

image

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బధిర అమ్మాయిల T10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఆంధ్రా జట్టు సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా 73/4 స్కోర్ చేయగా, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 68/4 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. టోర్నీలో రాణించిన కాంతమ్మకు ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.

News March 28, 2026

ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

image

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.

News March 28, 2026

SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

image

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్‌కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్‌గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్‌లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.