News October 7, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.

Similar News

News March 4, 2026

రాజమండ్రిలో విద్యుత్ ఘాతానికి గురైన విద్యార్థులు

image

రాజమండ్రి అనుశ్రీ థియేటర్ వద్ద ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ రామ్ విద్యార్థులను పరామర్శించారు. 15వ వార్డు చెందిన యన్.రమేశ్, 27వ వార్డు చెందిన ఉజ్వల ఈశ్వర సాయిలు మామిడికాయలు కోయడానికి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. అధికారులు స్పందించాలని భరత్ కోరారు.

News March 4, 2026

తూ.గో: మొబైల్ వాడొద్దన్నారని..!

image

బిక్కవోలు మండలం బలబద్రపురంలో అదృశ్యమైన బాలికను ఐదు గంటల్లోనే గుర్తించినట్లు SI రవిచంద్ర కుమార్ తెలిపారు. మొబైల్ ఎక్కువగా వాడుతోందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బాలిక ఆచూకీ కనిపెట్టారు. అనంతరం ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

News March 4, 2026

రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

image

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.