News October 7, 2024
నేడు విచారణకు నాగార్జున పిటిషన్

తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.
Similar News
News March 24, 2026
FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.

యుద్ధంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్

పశ్చిమాసియా యుద్ధంతో భారత్‌లో నెలకొంటున్న సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం రేపు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను నేతలకు వివరించనుంది. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ దేశ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి CDS జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, DRDO ఛైర్మన్ కామత్ తదితరులు హాజరయ్యారు.