News October 7, 2024

అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి

image

చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్‌కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.

Similar News

News October 7, 2024

పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్

image

ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్‌పర్ట్ నోవమ్ షాజీర్‌కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్‌బోట్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.

News October 7, 2024

సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత

image

ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అమ్మ మరణించడం మాకు తీరని లోటు. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఎంతో ప్రేమ, ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారు’ అని రాసుకొచ్చారు. ఈయన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు.

News October 7, 2024

విమానంలో అడల్ట్ మూవీ.. షాకైన ప్యాసింజర్స్

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు వెళుతున్న క్వాంటస్ విమానంలోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. మూవీ తమ స్క్రీన్లపై ప్రసారం కాగా దాన్ని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగినట్లు పేర్కొన్న ఎయిర్‌లైన్స్, ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.