News October 7, 2024
MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.
Similar News
News March 17, 2026
పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?
News March 17, 2026
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 16, 2026
పాలమూరు: SZ.. రేపు KHO-KHO ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్‌తో హాజరు కావాలన్నారు. SHARE IT


