News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

Similar News

News November 5, 2025

రాష్ట్ర భ‌విష్య‌త్తుకే త‌ల‌మానికం: మంత్రి డోలా

image

విశాఖ‌ వేదిక‌గా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికం కానుంద‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాట్ల‌ను బుధ‌వారం ప‌రిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వంద‌ల సంఖ్య‌లో వివిధ కంపెనీల ప్ర‌తినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, 7.5 లక్ష‌ల ఉద్యోగావ‌కాలు వ‌స్తాయ‌న్నారు.

News November 5, 2025

విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

image

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

image

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.