News October 7, 2024
అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ

రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.
Similar News
News March 11, 2025
ఢిల్లీ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్

IPLలో అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ పంజాబ్ కింగ్స్ 2, లక్నోకు 3 సీజన్లలో సారథ్యం వహించారు. ఇక అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా ఢిల్లీకి చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నారు. వీరిద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? కామెంట్ చేయండి.
News March 11, 2025
R5 జోన్ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.
News March 11, 2025
తగ్గిన బంగారం ధరలు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.