News October 7, 2024

నెల్లూరులో గజలక్ష్మిగా శ్రీ రాజరాజేశ్వరి

image

నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామి సన్నిధిలోనూ విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.

Similar News

News January 15, 2026

సంక్రాంతి సందర్భంగా.. కొత్త లుక్‌లో నెల్లూరు SP

image

పోలీస్ గ్రౌండ్‌లో SP అజిత వేజెండ్ల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి భోగి, సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. SP మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, భద్రత, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఎప్పుడూ యూనిఫామ్‌లో ఉండే SP సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

News January 15, 2026

నెల్లూరు: ‘నాకు రూ.5 వేలు వచ్చాయి’ అంటూ మెసేజ్ వచ్చిందా..

image

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చేజర్ల ఎస్సై తిరుమలరావు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.

News January 15, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం.. తల్లీకుమారుడి మృతి

image

ఉదయగిరి(M)లో నిన్న <<18859378>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. దాసరపల్లికి చెందిన సయ్యద్ సాహెర(36) భర్త ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉదయగిరిలో ఉంటున్నారు. కుమారుడు మజహర్(19)తో కలిసి సాహెర దాసరిపల్లికి వెళ్లింది. తిరిగి బైకుపై ఉదయగిరికి వస్తుండగా దుత్తలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. సాహెర స్పాట్‌లోనే చనిపోయింది. మజహర్‌ను వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్తుండగా మధ్యలో కన్నుమూశాడు.