News October 7, 2024

అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు

image

ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News October 7, 2024

కాసేపట్లో చంద్రబాబును కలవనున్న మల్లారెడ్డి

image

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బాబుతో భేటీ అవుతారని సమాచారం.

News October 7, 2024

పండుగల నేపథ్యంలో ఉగ్రదాడులకు ప్లాన్!

image

దసరా, దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీయులే లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

News October 7, 2024

రుణమాఫీ: మోదీకి మంత్రి తుమ్మల ఎదురు ప్రశ్న

image

తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్‌లో అన్నారు.