News October 7, 2024
5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO

JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.
Similar News
News March 4, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అరియర్లపై గుడ్‌న్యూస్

AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల్లో ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు ప్రభుత్వం 2018 జులై నుంచి DA అరియర్లు చెల్లించగా, పలు కారణాలతో చాలా మందికి అవి అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించే వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.


