News October 7, 2024

NLG: ఉపాధి ప్రణాళికకు అధికారుల కసరత్తు

image

జిల్లాలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు ఉపాధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 84 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ మాసం చివరినాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు. జిల్లాలో 3,58,571 జాబు కార్డులు ఉన్నాయి.

Similar News

News March 18, 2026

రాముడి పాదంతో రామడుగుగా మారింది ఈ గ్రామం

image

అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చింది. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.

News March 18, 2026

నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 18, 2026

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

image

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.