News October 7, 2024

ఈ ఏడాది SBIలో 10,000 ఉద్యోగాలు

image

ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం SBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎంట్రీ లెవెల్ నుంచి హైలెవెల్ వరకు దాదాపు 1,500 మంది టెక్నికల్ సిబ్బంది నియామకానికి ఇటీవల ఉద్యోగ ప్రకటన చేశామన్నారు. కొత్త ఉద్యోగాల్లో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్‌వర్క్ ఆపరేటర్స్ వంటివి ఉన్నట్లు తెలిపారు.

Similar News

News January 27, 2026

ఇదీ ట్విస్ట్ అంటే.. పాక్ ప్లేస్‌లో బంగ్లాకు ఛాన్స్?

image

బంగ్లాకు మద్దతుగా తామూ T20 WCను బహిష్కరిస్తామంటూ పాక్ గంతులు వేస్తోంది. ఇప్పటికే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు ICC అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాక్ కూడా వైదొలగితే ఆ ప్లేస్‌లోకి మళ్లీ అదే బంగ్లాను వెనక్కి పిలిచి శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని ICC ప్లాన్ చేస్తున్నట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. బంగ్లాకు మద్దతు సాకుతో భారత్‌పై విషం చిమ్ముతున్న పాక్‌ తన సీటుకు తానే ఎసరు పెట్టుకుంటోందన్నమాట!

ముగిసిన హల్వా వేడుక.. ఇక అధికారులకు ‘లాకిన్ పీరియడ్’

image

కేంద్ర బడ్జెట్ తయారీ చివరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన ‘హల్వా సెరిమనీ’కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హాజరై అధికారుల నోర్లు తీపి చేశారు. ఏదైనా శుభకార్యానికి ముందు నోటిని తీపి చేయడం మన ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని బడ్జెట్ టైమ్‌లోనూ పాటిస్తారు. ఇది ముగియగానే 60-70 మంది అధికారులు లాకిన్ పీరియడ్‌లోకి వెళ్తారు. బడ్జెట్‌ను సీక్రెట్‌గా ఉంచడం కోసం వాళ్లంతా ఫిబ్రవరి 1వరకు నార్త్‌ బ్లాక్‌లోనే ఉంటారు.