News October 7, 2024

వ్యోమగాముల ఆహారంగా గ్రహశకలాలు

image

దీర్ఘకాల స్పేస్ మిషన్లలో వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చడానికి సైంటిస్టులు కొత్త పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు. ‘పైరోలిసిస్’ ప్రక్రియతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి తినదగిన ఆహారంగా మార్చొచ్చు. ఇదే తరహాలో గ్రహశకలాల నుంచి కార్బన్‌ను సంగ్రహించి పోషకాలుగా మార్చడంపై పనిచేస్తున్నారు. భూమిపై పడిన ఉల్కలపై సూక్ష్మజీవులు వృద్ధి చెందడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది.

Similar News

News March 24, 2026

మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

image

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.

News March 24, 2026

కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

image

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.

News March 24, 2026

IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

image

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.