News October 7, 2024

ఇవాళ రా.9 నుంచి ఘాట్‌రోడ్డులో బైక్, ట్యాక్సీలపై నిషేధం

image

AP: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీవారికి కీలకమైన గరుడవాహన సేవ జరగనుంది. ఈ వేడుకను వీక్షించేందుకు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వాహన రద్దీని నియంత్రించడానికి ఇవాళ రా.9 నుంచి ఎల్లుండి ఉ.6 గంటల వరకు బైకులు, ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతిని నిరాకరించారు. రేపు సా.6.30 నుంచి రా.11 గంటల వరకు మలయప్పస్వామి గరుడ వాహనంపై విహరించనున్నారు.

Similar News

News December 30, 2024

మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కాంగ్రెస్‌

image

మ‌న్మోహ‌న్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థిక‌ల‌ను య‌మునా న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పాల్గొన‌లేదని కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌న్మోహ‌న్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ క‌లిసి పరామర్శించారని తెలిపింది. అస్థిక‌లు న‌దిలో క‌లిపే విష‌య‌మై వారితో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కాంగ్రెస్ వెల్ల‌డించింది.

News December 30, 2024

స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్

image

ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.

News December 30, 2024

ఒక్క సిగరెట్‌ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?

image

ఒక సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నార‌ని ఓ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్య‌య‌నం చేశారు. ధూమ‌పానం వ‌ల్ల‌ ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతార‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. జీవితం చివ‌ర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హ‌రిస్తుంద‌ని వివరించారు.