News October 7, 2024

HYD: గాంధీ నుంచి జైనూరు ఆదివాసి మహిళ డిశ్చార్జ్

image

ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమురం భీమ్ జిల్లా జైనూరుకు చెందిన ఆదివాసి మహిళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పూర్తి కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. అలాగే కొంత నగదు, దుస్తులను అందజేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Similar News

News October 7, 2024

HYD: విషాదం.. లిఫ్ట్ అడిగి ప్రాణం కోల్పోయాడు..!

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో ఈరోజు <<14293025>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా పని చేస్తున్న షేక్ మదినా పాషా (42) ఈరోజు ఉదయం TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రవణ్ (38) అనే వ్యక్తి అతడిని లిఫ్ట్ అడిగాడు. అతడిని బైక్ ఎక్కించుకుని కలిసి వెళ్తుండగా లారీ వారి బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.

News October 7, 2024

అన్నపూర్ణాదేవి అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల్లో ఒకటి గల బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఈరోజు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారు నేడు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. మొదటి రోజు నుంచే అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు నగరం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News October 7, 2024

HYD: ప్రముఖ కట్టడాలన్నీ FTL పరిధిలోనే ఉన్నాయి: ఒవైసీ

image

సచివాలయం, బాపు ఘాట్‌తో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు కూడా FTL పరిధిలోనే ఉన్నాయని HYD ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సచివాలయం FTL పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది.. పేదల ఇళ్లు ఉంటే ఎందుకని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని.. మర్చిపోవద్దని ఒవైసీ పేర్కొన్నారు.