News October 7, 2024
Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్

గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.
Similar News
News January 26, 2026
గోళ్లు విరిగిపోతున్నాయా?

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్‌కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్‌ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.
News January 26, 2026
T20 WCలో పాక్ ఆడుతుందా? సీన్‌లోకి ఆ దేశ ప్రధాని..

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందా.. లేదా.. అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఈరోజు PCB ఛైర్మన్ నఖ్వీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ‘బాయ్‌కాట్’ ఆలోచన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే టీమ్‌ను ప్రకటించగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పాక్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News January 26, 2026
ఇల్లు/షాప్ ముందు ఎలాంటి గుమ్మడికాయ కట్టాలి?

దిష్టి తగలకుండా కట్టే గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. దానికి తొడిమ తప్పనిసరిగా ఉండాలి. తొడిమ ఊడిపోయిన దానిని కట్టకూడదు. దీనిని ఇంటికి తెచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బోర్లించకూడదు. తొడిమ పైకి ఉండేలా పట్టుకుని రావాలి. అలాగే గుమ్మడికాయను నీటితో కడగడం నిషిద్ధం. అలా చేస్తే దానికున్న శక్తి తగ్గిపోతుందని అంటారు. కడగకుండానే పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యోదయానికి ముందే కట్టాలి.


