News October 7, 2024
మహాచండీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు విజయవాడ దుర్గమ్మ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ దేవి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. మరోవైపు వరంగల్ జిల్లా భద్రకాళీ దేవస్థానంలో లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
Similar News
News April 1, 2026
AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.
News April 1, 2026
ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.