News October 7, 2024

పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్

image

ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్‌పర్ట్ నోవమ్ షాజీర్‌కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్‌బోట్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.

Similar News

News March 24, 2026

వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

image

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.

News March 24, 2026

44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నోయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ 44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేేయనుంది. DM/MCh అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఏప్రిల్ 24న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,20,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు, SC, ST, OBC, EWS అభ్యర్థులకు రూ.3500. వెబ్‌సైట్: https://pgich.edu.in

News March 24, 2026

కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

image

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.