News October 7, 2024
రుణమాఫీ: మోదీకి మంత్రి తుమ్మల ఎదురు ప్రశ్న

తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్‌లో అన్నారు.
Similar News
News April 4, 2026
దొంగతనం కేసులో న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ నిరాకరణ

నిందితులకు శిక్షలు విధించే న్యాయమూర్తే దొంగతనం కేసును ఎదుర్కొంటున్న ఘటన పంజాబ్‌లోని పటియాలాలో జరిగింది. గతేడాది అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కన్వల్జిత్ సింగ్ చనిపోయారు. అదే రోజు రాత్రి ఆయన ఇంట్లో సివిల్ జడ్జి విక్రమ్‌దీప్ బంగారు ఆభరణాలను దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది. వీడియో ఆధారాలున్నందున బెయిల్ ఇవ్వలేమంది.
News April 4, 2026
భూమి లాంటి గ్రహాలు 45 ఉన్నాయట!

మన సౌర వ్యవస్థ వెలుపల జీవనానికి అనువైన 45 గ్రహాలు ఉన్నాయని కార్నెల్ వర్సిటీ(US) సైంటిస్టులు గుర్తించారు. నాసా వద్ద ఉన్న 6Kకు పైగా గ్రహాల సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ప్లానెట్ నక్షత్రం నుంచి ఎనర్జీని ఎలా పొందుతుందో పరిశీలించారు. ఉపరితలంపై ద్రవ రూపంలో నీరుండటానికి ఇదొక కీలక అంశం. వీటిలో TRAPPIST-1 అనే గ్రహం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
* light-year=9.46 trillion kilometers
News April 4, 2026
ఆరెంజ్ క్యాప్‌తో హిట్‌మ్యాన్

IPL: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ సాధించారు. ఢిల్లీపై బ్యాటింగ్ అనంతరం ఇంటర్వ్యూలో ఆ క్యాప్ ధరించారు. హిట్‌మ్యాన్ రెండు మ్యాచుల్లో కలిపి 56.50 సగటుతో 113 రన్స్ చేశారు. రోహిత్ తర్వాత కనోలి (108), రఘువంశీ (103), ఇషాన్ (94) ఉన్నారు.


