News October 7, 2024
ఉచిత ఇసుక.. నేతి బీరకాయ చందం: అంబటి

AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో ఉచిత ఇసుకలోని ఉచితం అంత!’ అని రాసుకొచ్చారు. కాగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటే ఎక్కువ రవాణా ఖర్చవుతోందని విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. రవాణా ఛార్జీల్లో ఏకీకృత విధానం ఉండాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<


