News October 7, 2024
HYD: మహిళలకు రాచకొండ పోలీసుల సూచనలు

రాచకొండ పోలీసులు మహిళలు సురక్షితంగా ఉండేందుకు సలహాలు, సూచనలు X వేదికగా తెలిపారు. మీరు పని చేస్తున్న ప్రదేశాల్లో ఎవరైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా..మీతో అసభ్యంగా ప్రవర్తించినా.. వేధింపులకు గురి చేసినా వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. సురక్షితంగా జీవించడం మహిళల హక్కు అని అన్నారు. షీ టీమ్స్ నంబర్లు: 8712662666, 8712662111. SHARE IT
Similar News
News October 28, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష

BRS నేతలు మహిళల కన్నీళ్లను కూడా రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని పేర్కొన్నారు.
News October 28, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్‌ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.
News October 28, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: మహిళలు.. కేవలం 7 శాతమేనా!

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇపుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ అదే పరిస్థితి. కేవలం 7% మంది మాత్రమే పోటీచేస్తున్నారు. మొత్తం 58 మంది ఈ ఎన్నికల్లో బరిలో ఉండగా కేవలం నలుగురే పోటీలో ఉన్నారు. దీంతో.. ఇదేనా మహిళలకు దక్కే సమానత్వం అని పలువురు వాపోతున్నారు.


