News October 7, 2024
HYD: ప్రముఖ కట్టడాలన్నీ FTL పరిధిలోనే ఉన్నాయి: ఒవైసీ

సచివాలయం, బాపు ఘాట్‌తో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు కూడా FTL పరిధిలోనే ఉన్నాయని HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సచివాలయం FTL పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది.. పేదల ఇళ్లు ఉంటే ఎందుకని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని.. మర్చిపోవద్దని ఒవైసీ పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 22, 2026
HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.
News March 22, 2026
HYD: బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై 21మీ. పైబడిన భవనాలను హైరైజ్‌గా పరిగణిస్తారు. భవన నిర్మాణ అనుమతులకు 50% TDR తప్పనిసరి కాగా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేలోపు మిగిలిన 50% చెల్లించాలి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతిస్తారు. సెట్ బ్యాక్ సడలింపులు అదనపు అంతస్తుల వినియోగంలో TDR లోడింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది.


