News October 7, 2024

New Study: గుండ్రని పొట్ట గుండెకు చేటు

image

పొట్ట ఎంత ఎక్కువ గుండ్రంగా ఉంటే గుండె జబ్బులు అంత ఎక్కువగా వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ఓ కథనం పేర్కొంది. BMIతో పోలిస్తే BRI (బాడీ రౌండ్ ఇండెక్స్) మరింత మెరుగ్గా వీటిని అంచనా వేస్తుందని తెలిపింది. ఆరేళ్లకు పైగా ఎక్కువ BRI ఉంటే ముప్పు 163% వరకు పెరుగుతుందని హెచ్చరించింది. BRIలో హైట్, వెయిట్‌తో పాటు పొట్ట చుట్టుకొలతా తీసుకుంటారు. ఒబెసిటీతో BP, షుగర్, గుండె జబ్బులు రావడం తెలిసిందే.

Similar News

News April 3, 2026

హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

image

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.

News April 3, 2026

BREAKING: పెరిగిన బంగారం ధర

image

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.

News April 3, 2026

ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

image

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్‌.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-14, టెక్నికల్‌ ఆఫీసర్‌-8, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-3, సీనియర్‌ ఆర్టీజన్‌-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.