News October 7, 2024
వైద్యశాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్ బహుమతి

2024 ఏడాదికిగానూ వైద్యరంగంలో ఇద్దరు అమెరికన్లను నోబెల్ వరించింది. మైక్రోRNAను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్‌క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై పరిశోధనలకు గానూ విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ అసెంబ్లీ ఈ ప్రకటన చేసింది. త్వరలో రంగాల వారీగా నోబెల్ ప్రైజ్‌లను ప్రకటిస్తారు.
Similar News
News April 3, 2026
13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 3, 2026
₹10,000CRతో ‘మావిగన్’ మహానగరం: భరత్

AP: అమరావతికి వెచ్చించే ₹2L కోట్లలో కేవలం ₹10,000CR ‘మావిగన్’కు ఖర్చు చేస్తే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో మహానగరం అభివృద్ధి చెందుతుందని YCP మాజీ MP భరత్ పేర్కొన్నారు. ‘మావిగన్ HYD, బెంగళూరుతో పోటీపడుతుంది. నగరాల అభివృద్ధికి వందల ఏళ్లు పడుతుంది. విశాఖ, విజయవాడ నగరాలను కాదని అమరావతిని శూన్యం నుంచి మొదలు పెడతారా? రాజధాని పేరుతో దోచుకుంటున్న CBN, ఇతర నేతలకే అమరావతి గ్రోత్ ఇంజిన్’ అని విమర్శించారు.
News April 3, 2026
యుద్ధం.. భారత్‌కు రష్యా భరోసా

పశ్చిమాసియాలో యుద్ధం, ఇంధన సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా ఇచ్చింది. ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తమ దేశ కంపెనీల వద్ద ఆ సామర్థ్యం ఉందని, సప్లై పెంచుతామని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంతురోవ్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల, NSA అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు.


