News October 7, 2024
SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ

జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Similar News
News March 8, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 8, 2026
శ్రీకాకుళం: ‘రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలి’

రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, నరసన్నపేట పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్ఎంటీఎస్‌కు శ్రీకాకుళంలోని నైరాలో శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన వన పంటల సాగుతో ఏడాది పాటు రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.