News October 7, 2024

చెరువులపై సమగ్ర అధ్యయనం.. 3 నెలల్లో సర్వే పూర్తికి ఆదేశం

image

TG: HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేసి చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. సర్వే పూర్తయ్యాక ఆ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News

News March 6, 2025

జైశంకర్‌పై ఖలిస్థానీల దాడి యత్నంపై మండిపడ్డ భారత్

image

EAM జైశంకర్ UK పర్యటనలో భద్రతా <<15666524>>లోపంపై<<>> భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. ‘జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరిశీలించాం. వేర్పాటువాదులు, అతివాదుల రెచ్చగొట్టే చర్యల్ని ఖండిస్తున్నాం. వారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం విచారకరం. ఇలాంటి ఘటనలపై ఆతిథ్య ప్రభుత్వం మేం కోరుకుంటున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.

News March 6, 2025

దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి: సీఎం చంద్రబాబు

image

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశంపై లోతుగా విశ్లేషణ చేస్తారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తమ ఫ్యామిలీలో ఆయనొక విశిష్టమైన, సంతోషకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు 40 ఏళ్లుగా కలసి ఉన్నాయని చెప్పారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందామన్నారు. దగ్గుబాటి రచయిత కాకపోయినా ఎవరూ టచ్ చేయని అంశంపై పుస్తకం రాశారని ప్రశంసించారు.

News March 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. న్యూజిలాండ్‌కు షాక్?

image

CT: నిన్న SAతో జరిగిన సెమీస్‌లో కివీస్ బౌలర్ హెన్రీ గాయపడ్డారు. క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో భుజం నేలకు బలంగా తాకింది. వెంటనే మైదానాన్ని వీడిన అతను మళ్లీ వచ్చినా బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డారు. దీంతో ఆదివారం INDతో జరిగే ఫైనల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే కివీస్‌కు పెద్ద దెబ్బే. అతని గాయం తీవ్రతను పరిశీలిస్తున్నామని కెప్టెన్ శాంట్నర్ చెప్పారు. కాగా హెన్రీ INDపై 21 వికెట్లు తీశారు.

error: Content is protected !!