News October 7, 2024

మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

image

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.

Similar News

News November 5, 2025

జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

image

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్‌ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్‌లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.

News November 5, 2025

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

image

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.

News November 5, 2025

దేశాన్ని కించపరిచే ప్రయత్నం: రాహుల్‌పై బీజేపీ ఫైర్

image

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ <<>>జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై BJP తీవ్రంగా స్పందించింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలని, దేశాన్ని కించపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ గేమ్స్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈసీని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ ఆయన అలాంటివి చేయరని ఎద్దేవా చేశారు.