News October 7, 2024

వరంగల్: ఈనెల 9న జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ములుగు రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 15, 2026

జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్‌లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.

News March 15, 2026

ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని సూచించారు. డీఆర్ఓ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

News March 15, 2026

ఏప్రిల్‌లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

image

ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ డా. సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.