News October 7, 2024

విశాఖ: టెట్ పరీక్షకు 84 శాతం మంది హాజరు

image

జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

Similar News

News September 21, 2025

గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

image

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్‌డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.

News September 21, 2025

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సమీక్ష

image

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణపై MLAగంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షించారు. గ్రామంలో సబ్‌రిజిస్ట్రార్ ధర ఎకరానికి రూ.17లక్షలు ఉందని, D.పట్టా భూములకు ఎకరానికి రెండున్నర రెట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. 520మంది రైతులకు వారి భూముల స్వరూపాన్ని బట్టి పరిహారం అందిస్తామన్నారు. గూగుల్ డేటా సెంటర్‌లో రైతుల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు.

News September 20, 2025

విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు: సీఎండీ

image

విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ అన్నారు. విశాఖ సాగర్ నగర్‌లోని ట్రైనింగ్ సెంటర్లో విశాఖ ఐఐఎం సహకారంతో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. వినియోగదారులకు మరింత చేరువకావడానికి ఉపయోగపడతాయన్నారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.