News October 7, 2024
రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడతాడు: చిన్ననాటి కోచ్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నారు. WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి తప్పుకుని వన్డేల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఫిట్‌నెస్ సమస్యలు కూడా లేవని తెలిపారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి రోహిత్ ఔటవడమే ప్రధాన కారణమని లాడ్ అభిప్రాయపడ్డారు.
Similar News
News December 30, 2024
మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమర్శలపై స్పందించిన కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థికలను యమునా నదిలో కలిపే కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం మన్మోహన్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పరామర్శించారని తెలిపింది. అస్థికలు నదిలో కలిపే విషయమై వారితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది.
News December 30, 2024
స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్
ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.
News December 30, 2024
ఒక్క సిగరెట్ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?
ఒక సిగరెట్ తాగడం వల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని ఓ అధ్యయనం అంచనా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ధూమపానం వల్ల ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతారని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితం చివర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హరిస్తుందని వివరించారు.