News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
Similar News
News March 10, 2026
కడప జిల్లాలో ఒక్కరోజే 273 కేసులు.!

కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు తనిఖీలు చేపట్టి 273 కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా రూ.64,710లు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 10, 2026
కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.
News March 9, 2026
కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.


