News October 7, 2024

ఆక్రమణలు గుర్తించేందుకు ప్రత్యేక యాప్: ‘హైడ్రా’ రంగనాథ్

image

TG: హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలు ఎక్కడ జరిగినా క్షణాల్లో హైడ్రాకు తెలిసేలా పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెరువుల FTL, బఫర్ జోన్లను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో రంగనాథ్ సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 29, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>ఇండియన్<<>> నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

News January 29, 2026

‘పంచాంగం’లో ఏం ఉంటాయో మీకు తెలుసా?

image

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల సమాహారమే పంచాంగం. మన తెలుగువారు చంద్రుడి గమనాన్ని బట్టి రూపొందించిన చాంద్రమాన పంచాంగాన్ని అనుసరిస్తారు. తిథి సంపదను, వారం ఆయుష్షును, నక్షత్రం పాపహరణాన్ని, యోగం రోగనివారణను, కరణం కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. శుభకార్యాలకు ముహూర్తాలు చూసుకోవడానికి, వర్జ్యం, అమృతఘడియలను తెలుసుకోవడానికి పంచాంగం ఎంతో అవసరం. ఇది మన దైనందిన జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపిస్తుంది.

News January 29, 2026

విమాన ప్రమాదం.. రామ్మోహన్‌కు MH CM లేఖ

image

అజిత్ పవార్ వెళ్తున్న <<18980548>>విమానం ప్రమాదానికి<<>> గురికావడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి MH CM ఫడణవీస్ లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంపై AAIB దర్యాప్తు ప్రారంభించిందని రామ్మోహన్ బదులిచ్చారు. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.