News October 7, 2024

సినిమా షూటింగ్.. నటుడికి గాయాలు

image

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ‘గూఢచారి-2’ సెట్స్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయమైంది. ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ తర్వాత ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ‘గూఢచారి-2’నే. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

Similar News

News November 9, 2025

రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్‌నాథ్

image

TG సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘<<18211719>>కాంగ్రెస్ అంటే ముస్లింలు<<>>.. ముస్లింలంటే కాంగ్రెస్ అని రెండుమూడు రోజుల కిందట TG సీఎం అన్నారు. రాజకీయాల్లో ఇంకా ఎంత వరకు దిగజారాలని కాంగ్రెస్ కోరుకుంటోంది?’ అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని, దీనిపై వారు తీవ్రంగా ఆలోచించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేయగలిగేది NDA మాత్రమేనని చెప్పారు.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

లిల్లీ పూలను విడి పువ్వులుగా, కట్ ఫ్లవర్స్‌గా, దండలకు, బొకేల తయారీకి, సుగంద ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు. లిల్లీ పూలలో అనేక రకాలున్నాయి.
☛ సింగిల్ రకాలు : వీటిలో పూల రేకులు ఒక వరసలో అమరి ఉంటాయి.
☛ ఉదా: కలకత్తా సింగిల్, హైదరాబాద్ సింగిల్, మెక్సికన్ సింగిల్, ఫులే రజిని, ప్రజ్వల్, రజత్ రేఖ, శ్రింగార్, అర్కా నిరంతర. వీటిని విడి పువ్వులుగా, పూల దండల కోసం, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి వినియోగిస్తారు.

News November 9, 2025

NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

image

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.