News October 7, 2024

ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

image

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్‌లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.

Similar News

News March 5, 2026

శ్రీకాకుళంలో మార్చి 8న శాప్ లీగ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలో ‘శాప్ లీగ్ – మాస్టర్స్ స్పోర్ట్స్ (వెటరన్స్)’ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 8న శ్రీకాకుళం ఆర్ట్స్ గ్రౌండ్‌లో ఈ ఎంపికలు జరుగుతాయని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News March 4, 2026

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

★శ్రీకాకుళం: టెన్త్ పాస్.. 230 ఖాళీలకు జాబ్ మేళా
★ సింగుపురం PHCకి కొత్త భవనం మంజూరు చేయాలి: MLA శంకర్
★టెక్కలి: రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
★ఆమదాలవలసలో అస్తవ్యస్తంగా రహదారులు
★SKLM: గిరిజనుల సాగు భూములకు పట్టాలివ్వాలి
★ఎచ్చెర్ల: పొలంలోనే టమాట పంటను వదిలేశారు
★ రెండు మాసాలు ముందే ఖరీఫ్‌కు సిద్ధం: అచ్చెన్నాయుడు
★ శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్లే ?

News March 4, 2026

SKLM: పాత నేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరి

image

పాతనేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరిని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కోర్టు వ్యవహారాలు, నాన్ బెయిల్బుల్‌పై విస్తృతంగా చర్చించారు. నూతనంగా ప్రారంభించిన నేరాలు నియంత్రణ హిస్టరీ రికార్డులుపై ఆరా తీశారు.