News October 7, 2024
మార్టూరులో విమానాశ్రయానికి ప్రతిపాదన: MLA ఏలూరి

మార్టూరులో విమానాశ్రయం, చినగంజాం మోటుపల్లిలో నౌకాశ్రయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినట్లు పర్చూరు MLA ఏలూరు సాంబశివరావు తెలిపారు. విజన్ 2047రాష్ట్రా అభివృద్ధిలో భాగంగా.. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో పలు మౌలిక వసతుల కల్పనకు ఈ డాక్యుమెంటరీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
Similar News
News February 17, 2026
ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్‌ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్‌పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.
News February 17, 2026
GNT-గుంతకల్లు ట్రాక్.. గాజులపల్లి టన్నెల్ పూర్తి

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.
News February 17, 2026
బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

పాకల బీచ్ ఫెస్టివల్‌లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.


