News October 7, 2024
HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.
Similar News
News March 17, 2026
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత!

RR జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత కార్యక్రమం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దంపతులు CARA పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి 3.5 ఏళ్ల తర్వాత పిల్లలను దత్తత తీసుకున్నారు. గత నెల రోజులుగా ఫాస్టర్ కేర్ కింద పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండగా అనుబంధం సరిగ్గా ఉండడంతో కలెక్టర్ వద్ద ఫైనల్ దత్తత పత్రాలు అందుకున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.
News March 16, 2026
రంగారెడ్డిలో రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని SC కార్పొరేషన్ ED పద్మావతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT
News March 14, 2026
పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.


