News October 7, 2024
నీట్ యూజీ పేపర్ లీకేజీకి అధునాతన టూల్ కిట్ వాడారు.. ఛార్జ్‌షీట్‌లో CBI

నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిందితులు అధునాతన టూల్ కిట్‌ను ఉపయోగించి పరీక్ష పేపర్ల ట్రంక్ పెట్టెను తెరిచినట్టు CBI ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఈ వ్యవహారంలో 144 మంది అభ్యర్థులు పేపర్ లీక్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ ఒయాసిస్ స్కూల్ నుంచి పరీక్షకు కొన్ని గంటల ముందు పేపర్ లీకైనట్టు తేలింది. ప్రధాన నిందితులు సహా 49 మందిని అరెస్టు చేసింది.
Similar News
News January 2, 2026
ఈ మార్పులతో 2026ని హెల్తీగా మార్చుకోండి!

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ఏడాది హెల్తీగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ప్రతిరోజూ వ్యాయామం, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 7-8 గంటలు నిద్రపోవాలి. జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌తో ఒత్తిడి తగ్గించుకోండి. కండరాల బలాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు’ అని వైద్యులు చెబుతున్నారు.
News January 2, 2026
కవిత BRSలో ఉన్నారా.. ఏమి?: కోమటిరెడ్డి

TG: KCR శాసనసభకు వస్తే BRS పుంజుకుంటుందని కవిత పేర్కొనడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆమె BRSలో ఉన్నారా? అనే అనుమానం వస్తోంది. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్నందుకు రక్తం మరిగిపోతోందని ఆమె అంటున్నారు. అంటే కేటీఆర్, హరీశ్‌లను ఉరివేసినా ఫర్వాలేదా? కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తన తమ్ముడితో తనకు విభేదాలు లేవని పేర్కొన్నారు.
News January 2, 2026
రూ.70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు!

మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.70 కోట్లతో తెరకెక్కగా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. VFX క్వాలిటీగా లేదని ఫస్ట్ డే నుంచే నెగటివ్ టాక్ రావడం సినిమా పాలిట శాపమైంది. బడ్జెట్‌లో కనీసం 10% కూడా రికవరీ అయ్యే అవకాశం లేదని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 2025లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.


