News October 8, 2024
రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?

మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
Similar News
News January 31, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 31, 2026
రష్యాపై US నిఘా.. బయటకొచ్చిన JUMPSEAT వివరాలు

కోల్డ్ వార్ కాలం నాటి తన అత్యంత రహస్య నిఘా కార్యక్రమం ‘JUMPSEAT’ వివరాలను అమెరికా తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో భాగంగా 1971-1987 మధ్య ప్రయోగించిన 8 ఉపగ్రహాలు 2006 వరకు పనిచేశాయి. ‘మోల్నియా’ కక్ష్యలో ప్రయాణిస్తూ సోవియట్ యూనియన్ క్షిపణులు, సైనిక సమాచారాన్ని ఇవి సేకరించేవి. సోవియట్ భూభాగంపై ఎక్కువ సమయం నిఘా ఉంచే వీలు కలిగేది. ఈ ప్రాజెక్ట్ ఆధునిక అంతరిక్ష నిఘా వ్యవస్థలకు పునాదిగా నిలిచింది.
News January 31, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 31, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.35 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.25 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


