News October 8, 2024
పాలకొల్లు: అయోధ్య రామమందిర పునాది డిజైనర్ ఈయనే..

అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన వ్యక్తి తెలుగువాడు కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీళ్లు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా గోరింటాడలో సత్కారం చేశారు.
Similar News
News March 15, 2026
ప.గో జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

జిల్లాలో అక్షరాంధ్ర లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 60,865 మంది అభ్యర్థులకు గాను 60,829 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను నూరు శాతం అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News March 15, 2026
ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2026
ప.గో: బండిపై వెళ్తుంటే భార్య గొంతు కోశాడు.. అసలేం జరిగింది?

భార్య గొంతు కోసిన భర్తను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సజ్జాపురానికి చెందిన కరగాని దిల్లేశ్వరి బండిపై వెళ్తుండగా, వెనుక కూర్చున్న భర్త గోవిందు బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మనస్పర్ధల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోవిందును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్ర గాయాలైన దిల్లేశ్వరికి చికిత్స అందుతోంది.


