News October 8, 2024
అక్టోబర్ 8: చరిత్రలో ఈ రోజు

1935: నటుడు మందాడ ప్రభాకర్ రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: దక్షిణాది నటి అర్చన జననం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1977: నటి మంచులక్ష్మి జననం
1981: దర్శకుడు దాసరి మారుతి జననం
* భారతీయ వైమానిక దళ దినోత్సవం
Similar News
News November 10, 2025
కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.
News November 10, 2025
హనుమాన్ చాలీసా భావం – 5

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 10, 2025
NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://nhsrcindia.org/


