News October 8, 2024

సచిన్ తొలి సెంచరీ ఎక్కడ చేశారంటే?

image

తాను అధికారికంగా మొదటి సెంచరీ బరోడాలో చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో తొలి సెంచరీ అండర్-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరఫున చేసినట్లు పేర్కొన్నారు. తన 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాలోనే ఆడినట్లు ఈ క్రీడా దిగ్గజం గుర్తు చేసుకున్నారు.

Similar News

News March 14, 2026

భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News March 14, 2026

కమల్‌ హాసన్‌పై చిన్మయి తీవ్ర విమర్శలు

image

తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి మండిపడ్డారు. ‘ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆయన అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కాగా గతంలో వైరముత్తు తనను వేధించాడని చిన్మయి తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు.

News March 14, 2026

విద్యుత్ వినియోగంలో ALL TIME RECORD

image

TG: రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఈ నెల 13న అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేశాయి. అలాగే ఉ.11.17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను విజయవంతంగా తట్టుకున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు. గతేడాది మార్చి 18న 335.19MU విద్యుత్ వాడకం, మార్చి 20న 17,162MW గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది. రోజుకు 350+ MU సరఫరా, 19,000MW గరిష్ఠ లోడ్‌ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.